
దీపారాధన దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం. Mahalakshmi E-Puja దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం. Online Puja పండగలు, పర్వదినాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు... ఇలా అనేక శుభ సమయాల్లో దీపప్రకాశనం చేస్తారు. ప్రధానంగా దేవాలయాల్లో కార్తికమాసమంతా మహిళలు దీపాలు వెలిగిస్తారు. పర్వదినాల్లో నదుల్లో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. దీపదాన మహిమను పద్మపురాణం విస్తృతంగా వర్ణించింది. దీపదానం వల్లనే ‘గుణవతి’ త్రిమూర్తుల ఆశీస్సులందుకుని, మరుజన్మలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుణ్ని భర్తగా పొందిందని పురాణ కథనం. కార్తికమాసంలో వెలిగించ...