కాలభైరవుడు గురించి ఎవ్వరికి తెలియని నిజాలు?

 

kala bhairava , kalabhairava ashtakam in telugu,kalabhairava ashtakam telugu


కాలభైరవుడు (kala bhairavaగురించి ఎవ్వరికి తెలియని నిజాలు? కాలభైరవున్ని పూజిస్తే

సకల గ్రహదోషాలు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయి

హిందూ దేవతలలో భైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది . గ్రహబలాలను

అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో

సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

Who is Kala Bhairva  ? 
కాల భైరవ ఎవరు?


కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా

కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని

కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని

శాస్త్రాలు చెబుతున్నాయి. హెూమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు

వేసిన తరువాతే ప్రధాన హెూమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని

అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి

గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు

ఆయుషుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని

ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి

 

భైరవుడు నాగుల్ని చెవిపోగులుగా, దండలకు, కాలికి మరియు యజ్ఞోపవీతంగా

అలంకరింబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు. ఇతని

వాహనం శునకం

కాల భైరవుడు మనకి వివిధ క్షేత్రాలలో ఎనిమిది రకాలుగా కనిపిస్తారు:- 

1

అసితాంగ భైరవుడు

2. సంహార భైరవుడు

3. రురు భైరవుడు

4. క్రోధ భైరవుడు

5. కపాల భైరవుడు

6. రుద్ర భైరవుడు

7. భీషణ భైరవుడు, మరియు 

8. ఉన్మత్త

భైరవుడు


పరమశివుని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురియై

భైరవుడిని సృష్టించి బ్రహ్మ దేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. వేంటనే

భైరవుడు శివుడని అవమానించిన బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒకదానిని

ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి శివుని

అనుగ్రహం మేరకు బ్రహ్మ దేవుని కపాలమును చేతిలో పట్టుకుని అనేక

ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన

అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరకు కపాలం కాశీ నగరంలో పడటం

వలన నగరంను బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు

ఓం నమో భగవతే స్వర్ణా కర్షణ భైరవాయ ధన ధాన్యవృద్ధి కరాయా శీగ్రం ధనం

ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా

ఓం క్లాంక్లిం ప్రాం ప్రీం హుం వం అపద్దుధారణాయ అజాలామలబద్ధాయ

లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దుఃఖ దారిద్ర విద్వేషణాయ ఓం హ్రీం

మహా భైరవాయ నమః

మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి పౌర్ణమి రోజులలో అరాదిస్తే మంచి

పలితం లభిస్తుంది you can also Book Online E-puja

 

శ్రీ స్వర్గాకర్షణ భైరవ యంత్రం - కాలభైరవ రూపు

స్వర్గాకర్షణ కాలభైరవ యంత్రాన్ని శని దోషం ఉన్నవారు, శని దశ, ఏల్నాటి శని

ఉన్నవారు, పనులు ఆటంకాలు కలుగుతున్నవారు, శని సంబంధ వృత్తి

ఉద్యోగాలలో రాణించాలనుకునేవారు, ధనాభివృద్ధి కొరకు యంత్రాన్ని పూజా

మందిరంలో ప్రతిష్టించుకొని పూజించు వారికి ధనాభివృద్ధితో పటు, శని బాధల

నుండి విముక్తి కలుగుతుంది. పిల్లలకు చదువులో శ్రద్ధ తగ్గుతున్న, దీర్ఘకాల

అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు కాలభైరవ

రూపు ధరించటం మంచిది

కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం

ఫ్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళో పాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది

కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర

సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు

సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక

దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ

నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు

కాలమే జగన్మూలం. కాలరూపుడే కాలబైరవుడు. కాలాన్ని జయించడం

సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని

అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో

సాధ్యం. కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అనేక

సంవత్సరాలు కాలభైరవాలయంలో సాధనచేసినట్లు పీఠంలో

సమయంలో వున్న సాధకులు తెలిపారు

 

 

కాలభైరవుడిని నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తారు

ఖాట్మండు నగర మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్

సుప్రీం కోర్టుగా పరిగణించబడేది. విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే

సజీవులై వుండలేరని నమ్మకం. ఇటువంటిదే కానీపాకంలో వినాయకుని

గురించి కూడా మనం వినవచ్చును. ఆధునికయుగంలోనూ కొన్ని కొన్ని

విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు ధన సమృద్ధిని, ఋణ

విముక్తిని ఇస్తాడు. అన్నిటికన్న ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత

సన్నిహితుడు, కారకుడు



Online Puja Booking



కాలభైరవ మంత్రం

స్తోత్రం

ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణుశివాత్మనే

నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ వరాత్మనే || ౧ ||

రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే

దివ్యమాల్య విభూషాయ నమస్తే దివ్యమూర్తయే || ౨ ||

నమస్తే అనేక హస్తాయ అనేక శిరసే నమః

నమస్తే అనేక నేత్రాయ అనేక విభవే నమః || 3 ||

నమస్తే అనేక కంఠాయ అనేకాంశాయ తే నమః

నమస్తే అనేక పార్శ్వాయ నమస్తే దివ్య తేజసే || ||

అనేకాఒయుధయుక్తోయ అనేక సురసేవినే

అనేక గుణయుక్తాయ మహాదేవాయ తే నమః || × ||

నమో దారిద్ ర్యకాలాయ మహాసంపత్ర్దాయినే

శ్రీ భైరవీ సంయుక్తాయ త్రిలోకేశాయ తే నమః || ౬ ||

దిగంబర నమస్తుభ్యం దివ్యాంగాయ నమో నమః

నమోఒస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః || ౭ ||

సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్య చక్షుషే


అజితాయ నమస్తుభ్యం జితమిత్రాయ తే నమః || ల||
నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః |
నమోఒస్త్వనంత వీర్యాయ మహాఘోరాయ తేనమః || ౯ ||
నమస్తే ఘోర ఘోరాయ విశ్వ ఘోరాయ తే నమ:ః |
నమః ఉగ్రాయ శాంతాయ భక్తానాం శాంతిదాయినే || ౧౦ ||
గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే
నమస్తే వాగృవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః | ౧౧ ||
నమస్తే కామరాజాయ యొషిత కామాయ తే నమః
దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాయ తే నమః || ౧౨||
సృష్టిమాయా స్వరూపాయ నిసర్గ సమయాయ తే |
సురలోక సుపూజ్యాయ ఆపదుద్ధారణాయ చ || ౧౩ ||
నమో నమో భైరవాయ మహాదారిద్ ర్యనాశినే
ఉన్మూలనే కర్మరాయ అలక్ష్మయాః సర్వదా నమః || ౧౪ |
నమో అజామలవధ్యాయ నమో లోకేష్వరాయ తే
స్వర్ణాకర్షణ శీలాయ భైరవాయ నమో నమః || ౧x. |॥|
మమ దారిద్ర్య విద్వేషణాయ లక్ష్యాయ తే నమః

నమో లోకత్రయేశాయ స్వానంద నిహితాయ తే || ౧౬ ||
నమః శ్రీ బీజరూపాయ సర్వకామప్రదాయినే
నమో మహాభైరవాయ శ్రీ భైరవ నమో నమ: || ౧a ||
ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః
నమః ప్రసన్న (రూపాయ) ఆదిదేవాయ తే నమః || ౧౮||
నమస్తే మంత్రరూపాయ నమస్తే మంత్రరూపిణే
నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః || ౧౯ I|
నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః
నమః శుద్దాయ బుద్ధాయ నమః సంసార తారిణే || ౨0 ||
నమో దేవాయ గుహ్యాయ ప్రచలాయ నమో నమః |
నమస్తే బాలరూపాయ పరేషాం బలనాశినే I| ౨౧||
నమస్తే స్వర్ణసంస్థాయ నమో భూతలవాసినే
నమః పాతాళవాసాయ అనాధారాయ తే నమః || ౨౨|
నమో నమస్తే శాంతాయ అనంతాయ నమో నమః
ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయ సుశోభినే || ౨3 ||
నమోఒణిమాది సిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః

పూర్ణచంద్ర ప్రతీకాశ వదనాంభోజ శోభినే || ౨ |
నమస్తే2స్తు స్వరూపాయ స్వర్ణాలంకార శోభినే
నమః స్వర్ణ్ాకర్షణాయ స్వర్ణాభాయ నమో నమః ॥| ౨×. I|
నమస్తే స్వర్ణకంఠాయ స్వర్ణాభ అంబరధారిణే
స్వర్ణసింహాసనస్థాయ స్వర్ణపాదాయ తే నమః || ౨౬ I|
నమః స్వర్ణాభపాదాయ స్వర్ణకాంచీ సుశోభినే
నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుధాత్మనే || ౨ ||
నమస్తే స్వర్ణభక్తాయ కల్పవృక్ష స్వరూపిణే
చింతామణి స్వరూపాయ నమో బ్రహ్మాది సేవినే || ౨ల ||
కల్పద్రుమాద్యః సంస్థాయ బహుస్వర్ణ ప్రదాయినే
నమో హేమాకర్షణాయ భైరవాయ నమో నమః || ౨F I|
స్తవేనానేన సంతుష్టో భవ లోకేశ భైరవ
పశ్య మాం కరుణాద్రుష్ట్యా శరణాగతవత్సల ॥/ 30 ||
శ్రీ మహాభైరవస్య ఇదం స్తోత్రముక్తం సుదుర్ణభం
మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్యప్రదాయకం || 3౧ ||
యః పఠేన్నిత్యం ఏకాగ్రం పాతకై స ప్రముచ్యతే

లభతే మహతీం లక్ష్మీం అఫ్టైశ్వర్యం అవాపు్నుయాత్ || 3.9 ||
చింతామణిం అవాప్నోతిధేను కల్పతరుం ధృవం |
స్వర్గరాశిం అవాప్నోతి శీఘ్రమేవ న సంశయః || 33 ||
త్రిసంధ్యం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమః|
స్వప్నే శ్రీ భైరవః తస్య సాక్షాత్ భూత్వా జగద్గురుః || 3౪ ||
స్వర్గరాశి దదాత్యస్యైతత్ క్షణం నాత్ర సంశయః |
అష్టావృత్యా పఠేత్ యస్తు సంధ్యాయాం వానరోత్తమం || 3× ||
లభతే సకలాన్ కామాన్ సప్తాహాన్ నాత్ర సంశయః
సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనాః || 3౬ ||
లోకత్రయం వశీకుర్యాత్ అచలాం లక్ష్మీం అవాప్నుయాత్
న భయం విద్యతే క్వాపి విషభూతాది సంభవం || 32 ||
.మ్రియతే శత్రవః తస్య అలక్ష్మీ నాశం ఆప్నుయాత్
అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః || 3౮ ||
అష్ట పంచాత్వర్థాద్యో మంత్రరాజః ప్రకీర్తితః |
దారిద్ర్య దుఃఖశమనః స్వర్ణాకర్షణ కారకః || 3౯ ||
య ఏన సంచయేత్ ధీమాన్ స్తోత్రం వాప్రపఠేత్ సదా

మహాభైరవ సాయుజ్యం స అనంతకాలే లభేత్ ధృవం || vం||
ఇతి రుద్రయామల తండత్రే స్వర్గాకర్షణ భైరవ స్తోత్రం సంపూర్ణం |
గమనిక: బీజాలతో ఉన్న మూల మంత్రాలు ఎలా అంటే అలా పటించ
కూడదు.. ఇక్కడ ఇచ్చిన భైరవ స్త్రోత్రం మటుకు నిత్యపారాయన స్త్రోత్రం గా
రోజు చదువు కోవచ్చు..
ముఖ్యంగా చేతబడి, బాణామతి, చిల్లంగి,లాంటి క్షుద్రపూజలకు గురి అన్నట్టు
ఎవరుకైనా ఆనిపిస్తే కలభైరవ దర్శనం చేసుకొని నిత్యం బైరవ అష్టకమ్
చదవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది, ఈ రోజులో అలాంటివి ఇంకా చేసే
వాళ్ళు ఉన్నారా లేరా నాకు తెలియదు కాని.. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆకలి
లేకపోవడం నిద్రలో లోయలోకి పడినట్టు బ్రాంతి కలగటం, అశుభబ్రంగా ఉన్న
ప్రాంతాలు కలలోకి కనిపించడం, కారణం ల3ికుండా కోపం, బాధ కలగటం
వంటి మానసిక ఆందోళన ఉన్న వారికి ఈ కలభైరవ అష్టకం నిత్యం పారాయణం
చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు అని తెలిసింది
శివాయ నమః |


కాలభైరవ అష్టకమ్



దేవరాజసేవ్యమానపావనా్రిపజ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్తుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృద్ధవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే| ౧|
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణమీప్పితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్ష శూలమక్ష రం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే|౨
శూలటజ్కపాశదణ్ఞపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్ణవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||3|


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారునిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకిజ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే||v|
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాజమణలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| *I
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరణ్ఞనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంప్టమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే||౬||
అట్టహాసభిన్నపద్మజాణ్ణకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్జరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే||2|

భూతసజ్జనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే||u|
కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమహబ్రన్యలోభకోపఆపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్రిసన్నిధిం ధ్రువమ్|l ||
ఇతి శ్రీమచ్చజ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్
ఈశ్లోకం మనకు ఇచ్చింది శంకరాచార్యులు వారు నమ్మకంతో పారాయణం
చేయండి)
దుర్మార్గులకు ఈయన భేతాల బైరవుడు, సదాచారులకు నా తండ్రి భోళా
శంకరుడు.. కాబట్టి మంచివాళ్ళు ఈయనకు బయపడవలసిన పని లేదు



 

 

Comments

Popular posts from this blog

మీ రాశి ప్రకారం 2023 సంవత్సరంలో మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి ? find your lucky numerology 2023 Lucky number?

మీ జీవితాన్ని శక్తివంతం చేయగల మరియు మీ విధిని మెరుగుపరచగల 6 సరళమైన అలవాట్లు

Can Astrology Be The One Stop Solution To All Problems In Your Life?