December 10 Daily Horoscope: రోజువారీ రాశి ఫలాలు - తిథి- మార్గశిర శుద్ధ సప్తమి.. కొత్త పరిచయాలతో ఆర్ధిక లాభం .

 

రోజువారీ రాశి ఫలాలు


December 10 Horoscope: తిథి- మార్గశిర శుద్ధ సప్తమి.. కొత్త పరిచయాలతో ఆర్ధిక లాభం .







 

Horoscope prediction today: నేడు శుక్రవారం (డిసెంబర్ 10). రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ముందుగా పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం
డిసెంబర్​ 2021 డిసెంబర్​, 10 (శుక్రవారం)
సూర్యోదయం ఉదయం 6:21 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:21 గంటలకు
తిథి- మార్గశిర శుద్ధ సప్తమి రాత్రి 12:31 గంటల వరకు తదుపరి అష్టమి 
రాహుకాలం: మధ్యాహ్నం 03:30 గంటల నుంచి 4:30 గంటల వరకు 
దుర్ముహూర్తం: ఉదయం 8:34 గంటల నుంచి 09:18 గంటల వరకు
అమృతఘడియలు: రాత్రి 8:15 గంటల నుంచి 9:50 గంటల వరకు

రాశి ఫలాలు..

మేష రాశి (Aries)

బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఖర్చులు పెరిగే అవకాశముంది. ఘటన మీ మనస్సును బాధ పెట్టొచ్చు. వ్యాపారులు, నిరుద్యోగులకు సానుకూలంగా ఉంది.

వృషభ రాశి (Taurus)

మీపై మీరు నమ్మకం ఉంచి చేసే పనులు ఫలితాలనిస్తాయి. దృఢమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. వాహన యోగం ఉంది.

మిథున రాశి (Gemini)

కొనుగోళ్లు జరిపే అవకాశాలున్నాయి. కొన్ని ముక్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులకు కాస్త గడ్డుకాలం నడుస్తోంది.

కర్కాటక రాశి (Cancer)

శ్రమ వృధాగా పోతుంది. ఆశించిన ఫలితాలు సాధించనందుకు నిరుత్సాహపడే అవకాశముంది. బుద్ధిబలంతో వ్యవహరించాలి. కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా బాగా లేదు.

సింహ రాశి (Leo)

కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్త మీ అనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థికంగా బలపడతారు. పనులు సాఫీగా సాగటం, బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడపడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయి.

కన్యా రాశి (Virgo)

రోజు మీకు అంతా శుభం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సానుకూలతలు ఉన్నాయి. సమస్య నుంచి బయటపడతారు. అయితే ఆచి తూచి వ్యవహరించాల్సిన సమయమిది. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారి తీయొచ్చు జాగ్రత్త.

Ads : online astrologer in bangalore , best astrologer in bangalore , online jyotish

తులా రాశి (Libra)

కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఇబ్బందికర పరిస్థితిలు ఎదురువ్వచ్చు. అప్పు కోసం ప్రయత్నాలు చేస్తారు. పనులు మాత్రం సకాలంలో పూర్తి చేయ గలుగుతారు. మంచి వార్త మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

వృశ్చిక రాశి (Scorpio)

రోజు మీకు మిశ్రమంగా ఉంది. భవిష్యత్కోసం వేసే ప్రణాళికలు ఫలితాలనిస్తాయి. అయితే కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండానే మీపై నిందలు పడే అకాశముంది. కుటుంబంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు రాశి (Sagittarius)

రోజంతా ఆహ్లాదంగా గడుపుతారు. ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గుడ్న్యూస్ వింటారు. వ్యాపారులు, ఉద్యోగులకు సానుకూలంగా ఉంది. శుభకార్యాలు, విందు వినోదాలకు హాజరవుతారు.

మకర రాశి (Capricorn)

ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. పనులు ప్రారంభించిన అతి కష్టం మీద పూర్తి చేస్తారు. తగాదాలకు తావివ్వకూడదు. ఇంట్లో సమస్యలు మానసికంగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి

కుంభ రాశి (Aquarius)

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సఉద్యోగులు, వ్యాపారులకు కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో స్థిరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది

మీన రాశి (Pices)

అన్ని విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వచ్చు. వ్యాపారాలు మందగొడిగా సాగొచ్చు. ఉద్యోగులకు అనుకోని ఇబ్బందులు రావచ్చు. మాట పట్టింపుల వల్ల మానసిక ప్రశాంతత దూరమవ్వచ్చు. మానసికంగా మాత్రం దృఢంగా ఉంటారు. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.

 

Comments

Popular posts from this blog

మీ జీవితాన్ని శక్తివంతం చేయగల మరియు మీ విధిని మెరుగుపరచగల 6 సరళమైన అలవాట్లు

Can Astrology Be The One Stop Solution To All Problems In Your Life?